Monday, December 23, 2024

9 వందేభారత్ రైళ్లకు ప్రధాని పచ్చజెండా

- Advertisement -
- Advertisement -

జాబితాలో కాచిగూడ-యశ్వంత్‌పూర్ రైలు

ఐటి ఉద్యోగులకు వెసులుబాటు

ఒకే రోజు ప్రధాని మోడీ ప్రారంభం

న్యూఢిల్లీ : ఒకేరోజు దేశంలో తొమ్మిది వందేభారత్ రై ళ్లు ఆరంభం అయ్యాయి. ప్రధాని నరేంంద్ర మోడీ వ ర్చువల్ ప ద్థతిలో ఈ తొమ్మిది వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా చూపి ప్రారంభించారు. త మ హయాంకు ముం దు దేశంలో రైళ్ల , రైలు మార్గాల ఆధునీకరణకు పెద్దగా దృష్టి పెట్టలేదని, ఇది దురదృష్టకరమని తెలిపారు. ఈ దశ నుంచి భారతీయ రైల్వేను పరివర్తన స్థాయికి తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ తొమ్మిది రైళ్ల ప్రారంభం దశలో ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల గుండా ఈ వందేభారత్ రైళ్లు ప్రయాణ అనుసంధానం దిశలో కీలక పా త్ర పోషిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదే శ్, రాజస్థాన్, తమిళనాడు, క ర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జా ర్ఖండ్ , గుజరాత్ రాష్ట్రాలలో ఈ రై ళ్లతో ప్రయాణికులు మరింత వేగవంత ప్రయాణ సౌకర్యం పొందుతారు. ఈ వందేభారత్ రైళ్ల వేగం, వీటి ఏర్పాట్లు 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్న అధునాతన రైలు ప్రయాణాల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. రోజురోజుకీ వందేభారత్ రైళ్ల పట్ల జనంలో ఆదరణ పెరుగుతోందని, ఈ క్రమంలో ఇప్పటికే ఈ రైళ్ల ద్వారా 1,11,00,000 మంది ప్రయాణికులు తమ త మ గమ్యస్థానాలకు ప్రయాణించారని వివరించారు. ఇ ప్పటికే పాతిక వరకూ వందేభారత్ రైళ్లు దూర ప్రాంతాలను కలుపుతున్నాయని తెలిపిన ప్రధాని ఇప్పుడు తీసుకువచ్చిన రైళ్లు వీటికి అదనం అన్నారు. దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలను ఈ రైళ్లతో ముడివేయడం జరుగుతుందని వివరించారు. ఈ సుదినం మరెంతో దూరం లో లేదన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ భారతీ య రైళ్లు కోట్లాది మంది పేద భారతీయుల, మధ్యతరగ తి ప్రజల జీవిత ప్రయాణంలో కలిసినడిచే సహ ప్రయాణికులు అయ్యాయని తెలిపారు. మన రైళ్లలో ఒక్కరోజు వెళ్లే ప్రయాణికు ల సంఖ్య ఒక్కోసారి పలు దేశాల జనాభా కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పా రు.ఇంతటి జన సమ్మేళన భారతీయ రైళ్లను ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదని ,ఈ శూన్యతను తాము ఇప్పుడు భర్తీ చేస్తున్నామని వివరించారు.

ఇప్పుడు వచ్చిన 9 వందేభారత్ రైళ్లు ఇవే
యశ్వంత్‌పూర్ కాచీగూడ మధ్యనడిచే హైదరాబాద్- బెంగళూరు వందేభారత్, ఉదయ్‌పూర్- జైపూర్, తిరునల్వేలి మధురై –చెన్నై రైలు, విజయవాడ -చెన్నై (వయా రేణిగుంట), పాట్నా -హౌరా, కేసర్‌గఢ్ -తిరువనంతపురం , రూర్కేలా -భువనేశ్వర్ పూరి, రాంచీ -హౌరా, జామ్‌నగర్ -అహ్మదాబాద్ వందేభారత్ రైళ్లు. ఇప్పుడు ప్రవేశపెట్టిన రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలు, మతపరమైన స్థలాలు, పర్యాటక కేంద్రాలను కలుపుతూ వెళ్లుతాయి.

తెలంగాణలో 3వ వందేభారత్
బెంగళూరుకు వెళ్లే ఐటిలకు వెసులుబాటు
ఇప్పుడు ప్రవేశపెట్టిన యశ్వంత్‌పూర్ -కాచీగూడ వం దేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణలో సాగే మూడో వందేభారత్ అవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు 3 రాష్ట్రాలు, 12 జిల్లాలను కలుపుతూ వెళ్లుతుంది. ఈ వందేభారత్ ద్వారా ఐటి కంపెనీలలో పనిచేసే టెకీలు బెంగళూరుకు వెళ్లి తిరిగి అదేరోజు హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. ఈ రైలు మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 530 మంది ప్రయాణికుల సామర్థం ఉంది. ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్‌కార్ కోచ్‌లు ఉంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News