Monday, December 23, 2024

ప్రధాని సోదరుడు సోమాభాయ్ భావోద్వేగం

- Advertisement -
- Advertisement -

పోలింగ్ రోజు తల్లిని గుర్తు చేసుకున్న వైనం

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు సోమాభాయ్ మోడీ మంగళవారం తమ తల్లి దివంగత హీరాబాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె స్వర్గం నుంచి ప్రధానికి ఆశీస్సులు అందజేయగలరని సోమాభాయ్ అన్నారు. ప్రజల వలె తాను కూడా తన సోదరుడు మూడవ పర్యాయం ప్రధాని కావాలని వాంఛిస్తున్నానని చెప్పారు. ప్రధాని మోడీ తన తల్లిని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆమె నివాసంలో కలుసుకుని వోటు వేయడానికి ముందు ఆమె ఆశీస్సులు తీసుకుంటుండేవారు. హీరాబా 2022 డిసెంబర్‌లో కన్నుమూశారు.

‘మా తల్లి ఇక లేరు. కాని ఆమె ఇప్పుడు స్వర్గం నుంచి నరేంద్రభాయ్‌కు తన ఆశీస్సులు ఇస్తూ ఉండాలి’ అని సోమాభాయ్ గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రాణిప్ ప్రాంతంలోని ఒక పోలింగ్ కేంద్రంలో అశ్రుపూరిత నయనాలతో చెప్పారు. ఆ పోలింగ్ కేంద్రంలోనే ప్రధాని మోడీ మంగళవారం ఉదయం తన వోటు వేశారు. రాణిప్‌లో పోలింగ్ కేంద్రం వెలుపల ప్రధాన నరేంద్ర మోడీని సోమాభాయ్ కలుసుకున్నారు. పరస్పరం క్షేమం, ఆరోగ్యం గురించి తాము ఇద్దరం వాకబు చేసుకున్నామని ఆయన తెలిపారు. ‘ఈ ప్రాంత ప్రజల వలె నేను కూడా నరేంద్రభాయ్ ఈ ఎన్నికల తరువాత మూడవ దఫా ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News