Monday, December 23, 2024

పగిడ్యాల సొసైటీకి ప్రధాని ప్రశంస!

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పగిడ్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రధాని మోదీ ప్రశంసలు లభించాయి. వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రధాని దేశవ్యాప్తంగా లబ్ధిదారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో పగిడ్యాల సహకార సంఘం సభ్యుడు ఖాజా మొయినుద్దీన్ తో ఆయన కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఖాజా మొయినుద్దీన్ తమ సొసైటీ గురించి వివరించారు. తమ సంస్థ 1921లో ప్రారంభమైందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక, తమ సొసైటీకి 3.15 కోట్ల నాబార్డు రుణం అందిందనీ చెప్పారు. తమ సంఘంలో 5600 మంది సభ్యులు ఉన్నారనీ, వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్నపాటి ఉత్సవం కూడా నిర్వహించుకున్నామని చెప్పారు.

అంతా విన్న ప్రధాని.. యూరియా, నానో ఎరువులు రెండూ వాడకూడదని, దీనివల్ల భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. సహకార రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News