న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యటిస్తున్నారు. 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి ప్రధాని జమ్ముకశ్మీర్ లో పర్యటనకు వెళ్లారు. డిల్లీ-అమృత్ సర్ కాట్రా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. పల్లిలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, సాంబలో 108 జన ఔషధీ కేంద్రాలను, అమృత్ సరోవర్ విషన్ ను ప్రారంభించారు. జాతీయ పంచాయత్ అవార్డు సాధించిన పంచాయతీలకు నగదు బదిలీ చేశారు. ఆదివారం జమ్మూలోని పల్లి గ్రామాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ.. కేంద్రపాలిత ప్రాంతంలో ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయికి చేరుకోవడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు.