Wednesday, January 22, 2025

నేడు వరంగల్‌కు మోడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర శనివారం వరంగల్ పర్యటనకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. ప్రధాని న రేంద్రమోడీ చేతుల మీదుగా మెగా టెక్స్‌టైల్ పార్క్, రైల్వే వ్యాగన్ ఓవరాహాలింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చే సిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం సర్వశక్తులొడ్డి ఎస్‌పీజీ రక్షణ వలయం మధ్యన సభ జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. హన్మకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలోనే మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఆ గ్రౌండ్‌లోనే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను వారం రోజులుగా ఎస్‌పీజీ డీఐజీ నవనీత్ కుమార్ పర్యవేక్షణలో వరంగల్ సీపీ రంగనాథ్, కలెక్టర్ సిక్తా ప ట్నాయక్‌ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. శనివారం ఉదయం 7.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్ వారణాసి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.9.30 నిమిషాలకు ఎంవన్17 హెలికాప్టర్ ద్వారా వరంగల్‌కు బయలుదేరి 10.15 నిమిషాలకు వరంగల్ మా మునూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10.30కి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. 10.30 నుండి 10.45 వరకు దర్శనం కార్యక్రమాలు చేస్తారు.

10.55 నిమిషాలకు భద్రకాళి దేవాలయం నుండి రోడ్డు మార్గాన 11గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11గంటల నుండి 11.35నిమిషాలకు ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన శంకుస్థాపనల ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేస్తారు. 11.45 నిమిషాలకు పక్కనే ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. 12.30 నిమిషాలకు పబ్లిక్ మీటింగ్ నుండి మామునూరు ఎయిర్‌పోర్టుకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 12.55 నిమిషాలకు మామునూరు ఎయిర్‌పోర్టులో హెలికాప్టర్ ద్వారా హకీంపేట ఎయిర్‌పోర్టుకు 13.40 నిమిషాలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి రక్షణ చర్యల్లో ఎస్‌పీజీ నేతృత్వంలో స్పెషల్ కమాండర్ ఇతర బలగాలను మోహరించారు.

27 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించనున్న మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరంగల్‌కు వస్తున్నందున కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు పార్టీ నేతలు, అధికారులు చేపట్టారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మామునూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ అక్కడి నుండి భద్రకాళి దేవాలయం, అక్కడి నుండి ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలకు రోడ్డు మార్గానే పర్యటించనున్నారు. మామునూరు నుండి ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలకు 27కిలోమీటర్ల దూరం ఉన్నందున రోడ్డు మార్గం ప్రయాణాన్ని పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి రక్షణ వలయంలో ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News