Monday, December 23, 2024

ఇదీ రాహుల్ గాంధీ వైఖరి… వీడియో రిలీజ్ చేసిన బిజేపి!

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్ పై బిజేపి నేతలు తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ, పార్టీ కార్యకర్తల పట్ల రాహుల్ వైఖరి ఇంత దారుణంగా ఉంటుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆ వీడియోలో ఏం ఉందంటే, రాహుల్ ఓ కుక్కకి బిస్కట్ తినిపించేందుకు ప్రయత్నించారు. అది తినకపోవడంతో అదే బిస్కట్ ను అక్కడ ఉన్న ఓ కార్యకర్తకు ఇచ్చారు.

బిజేపి నేత అమిత్ మాలవీయ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, కార్యకర్తల పట్ల రాహుల్ వైఖరి దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. “కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ బుత్ ఏజెంట్లను కుక్కలతో పోల్చారు. ఇప్పడు రాహుల్ గాంధీ కార్యకర్తలకు కుక్క బిస్కెట్లు ఇస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, పార్టీలో యువరాజు తమ కార్యకర్తలను కుక్కల్లా చూస్తుంటే, అలాంటి పార్టీ కనుమరుగు కావడం సహజమే కదా” అని కామెంట్ చేశారు.

ఈ వివాదంలోకి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా తలదూర్చారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పడు తనకు కూడా ఇలాగే కుక్క బిస్కెట్ తినిపించేందుకు ప్రయత్నించారనీ, తాను తినకుండా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశాననీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News