Saturday, November 16, 2024

ఫోన్ హ్యాకింగ్ కేసులో ప్రిన్స్ హ్యారీకి విజయం

- Advertisement -
- Advertisement -

లండన్: ఫోన్ హ్యాకింగ్ కేసులో డైలీ మిర్రర్ దినపత్రిక ప్రచురణకర్తలపై ప్రిన్స్ హ్యారీ విజయం సాధించారు. ఆయనకు 140,000 పౌండ్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఉదేశిస్తూ హైకోర్టుకు చెందిన జస్టిస్ టిమోఈ ఫాన్‌కోర్డు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మిర్రర్ న్యూస్ వార్తాపత్రికలకు అనేక సంవత్సరాలుగా ఫోన్ హ్యాకింగ్ అలవాటుగా మారిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరించడానికి ఆ తప్రిక ప్రవేట్ డిటెక్టివ్‌లను ఏర్పాటు చేసుకుంటుందని, ఈ విషయం తెలిసి కూడా ఆ సంస్థ యాజమాన్యం తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. పత్రిక ప్రచురించిన 33 వార్తాకథనాలలో 15 కథనాలు అక్రమ మార్గాలలో సమాచారం సేకరించినవేనని తేలింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News