Monday, December 23, 2024

కుటుంబ ఫోటో గందరగోళంపై బ్రిటన్ యువరాణి క్షమాపణ

- Advertisement -
- Advertisement -

కుటుంబ ఫోటోపై ఏర్పడిన గందరగోళానికి బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్‌టన్ క్షమాపణ కోరారు. తన ముగ్గురు పిల్లలతో కలసి ఆమె తీసుకున్న ఫోటోను ఆదివారం మీడియాకు విడుదల చేసి అనంతరం ఉపసంహరించుకోవడంతో గందరగోళం తలెత్తింది. బ్రిటన్‌లో మాతృ దినోత్సవం సందర్భంగా తన ముగ్గురు పిల్లలు జార్జి(10), లూయిస్(5), చార్లట్(5)తో కలసి తీసుకున్న ఫోటోను కేట్ మీడియాకు విడుదల చేశారు. ఈ ఫోటోను ఆమె భర్త యువరాజు విలియం విండ్సర్ రాజసౌధంలో గత వారం తీసినట్లు ప్యాలెస్ తెలిపింది.

ఫోటో ఎడిటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్న కారణంగానే దాన్ని ఉపసంహరించినట్లు ప్యాలెస్ తెలిపింది. చార్లట్ ఎడమ చేయి ఫోటోలో సరిగ్గా పడలేదని, అలాగే కేట్ తన పెళ్లి ఉంగరాన్ని ధరించకపోవడం ఈ ఫోటోలో కనిపిస్తోందని మీడియా సంస్థలు తెలిపాయి. గత జనవరిలో ఉదర సంబంధ వ్యాధికి శస్త్ర చికిత్స చేసుకున్న కేట్ గత కొన్ని వారాలుగా తన అధికార విధులకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఆరోగ్యంపై మీడియాలో కొన్ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ వదంతులకు చెక్ పెట్టేందుకే కేట్ కుటుంబ ఫోటోను ప్యాలస్ విడుదల చేసింది. అయితే ఆ ఫోటోలో లోపాలు ఉన్నాయన్న కారణంతో దాన్ని ఉపసంహరించుకోవడం గంరగోళానికి దారితీసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News