Wednesday, January 29, 2025

ప్రిన్సిపాల్, తండ్రి కొట్టడంతో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: పరీక్షలో కాపీ కొట్టడంతో విద్యార్థిని ప్రిన్సిపాల్ చితకబాదాడు. అనంతరం బాలుడి తండ్రికి చెప్పడంతో అతడు కూడా తోటి విద్యార్థుల ముందు తన కుమారుడిని కొట్టాడు. అవమానంగా భావించి సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

శభాష్ గూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పరీక్షలు జరుగుతుండగా బాలుడు కాపీ కొట్టాడు. దీంతో ప్రిన్సిపాల్ గమనించి బాలుడిని చితకబాదాడు. అనంతరం తండ్రికి తెలియజేయడంతో పాఠశాలకు వచ్చి అందరూ విద్యార్థుల ముందు తన కుమారుడిని తండ్రి కొట్టాడు. విద్యార్థి అవమానంగా భావించి వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు.
గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News