Monday, December 23, 2024

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

యాద్గిర్(కర్నాటక): ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ప్రవిన్సపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్(పరిపాలన) గాలెప్ప పూజారిని యాద్‌గిర్ మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థినితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా ఆ బాలికనుప్రిన్సిపాల్ లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారి స్కూలును సందర్శించి విచారణ జరిపారు. ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో జిల్లా విద్యా శాఖ కమిషనర్‌కు ఈ మేరకు నివేదిక అందచేశారు. నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా డిఇఓను కమిషనర్ ఆదేశించారు. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News