Wednesday, January 22, 2025

విహారయాత్రకు తీసుకెళ్లి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

లక్నో: విహారయాత్రకు తీసుకెళ్లి విద్యార్థినిపై గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. టూర్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మీరట్‌లో ఓ ప్రభుత్వ స్కూల్‌లో ప్రిన్సిపాల్ తొమ్మిది విద్యార్థులతో కలిసి నవంబర్ 23న విహారయాత్రకు వెళ్లారు. రాత్రి సమయంలో బస చేయడానికి హోటల్‌లో రెండు రూములు తీసుకున్నారు. ఒక రూమ్‌లో ఎనిమిది మంది విద్యార్థినిలను ఉంచి, రెండో రూమ్‌లో మరో విద్యార్థినితో కలిసి ప్రిన్సిపాల్ ఉన్నాడు.

విద్యార్థిని భోజనంతో మత్తు పదార్థం కలిపాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, చంపేస్తానని బెదిరించాడు. నవంబర్ 24న ఇళ్లకు చేరుకున్న తరువాత బాధితురాలు ఈఘటనపై మౌనంగా ఉంది. శనివారం ఆమె తన తల్లిదండ్రులకు తెలిపడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News