Monday, December 23, 2024

విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

మోమిన్‌పేట్: సభ్య సమాజం తలదించుకునేలా ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్ధ్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని మోమిన్‌పేట్ ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభు ఈ నెల 19వ తేదీ పాఠశాల విద్యార్ధినిని పాఠశాల తరగతి గదిని సాయంత్రం 4.15 గంటలకు శుభ్రం చేయమని ఆదేశించాడు. ఆ అమ్మాయి గదిని శుభ్రం చేస్తుండగా వెనుక నుంచి వెళ్లి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా అమ్మాయి వదిలించుకుని వెళ్లిపోయింది.

అమ్మాయి తల్లిదండ్రులు బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లమని చెపుతుండగా అమ్మాయి నేను వెళ్లనని ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం పిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. మోమిన్‌పేట్ ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న టి.ప్రభు గతంలో మోమిన్‌పేట మండల విద్యాధికారిగా కూడా విధులు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News