Saturday, November 16, 2024

జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యత : రజత్‌కుమార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో జీవ వైవిధ్య పరిరక్షణ, సామర్థ్య పెంపుదల, అవగాహన, పరిశోధనలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణం, సైన్స్,టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డాక్టర్ రజత్‌కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో జీవ వైవిధ్య స్ట్రాటజీ, ప్రణాళికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుసంపన్నమైన జీవ వైవిధ్యాన్ని కలిగి ఉందన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు అటవీ, వ్యవసాయం, నీటిపారుదల, పశుసంవర్ధక, మత్స్యశాఖ శాఖల కృషి ఎంతోగాను ఉందన్నారు. రాష్ట్రంలో జీవ వైవిధ్య పరిరక్షణపై సామర్థ్య పెంపు, అవగాహన, పరిశోధనలు చేయడంపై దృష్టి కేంద్రీకరించామని వెల్లడించారు. కార్యక్రమంలో జాతీయ జీవ వైవిధ్య సంస్థ చైర్‌పర్సన్ సి.అచలేందర్ రెడ్డి, యుఎన్‌డిపి సునీల్ పడాలే,ప్రొఫెసర్ విజ్జులత, సిఐపిఎస్ డైరెక్టర్ డాక్టర్ వల్లి మాణికం, సీనియర్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జీవ వైవిధ్య యాజమాన్య కమిటి సభ్యులు, ప్రణాళిక నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News