Monday, December 23, 2024

ఉద్యాన పంటలసాగుకు ప్రాధాన్యం: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Priority for horticulture

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ,ఉద్యాన, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదైన ఢిల్లీ ఆజాద్ పూర్ మండిని మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం నాడు సందర్శించారు. హైదరాబాద్ శివార్లలోని కొహెడ వద్ద 178కరాల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్న నేపధ్యంలో అజాద్ పూర్ మండీని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డిని అక్కడి మండి చైర్మన్ అదిల్ ఖాన్ సాదరంగా ఆహ్వానించి మండి కార్యక్రమాలను వివరించారు.

1975లో 90ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద మార్కెట్ ఇదే అని, దీని ద్వారా ఏటా రూ.100కోట్లు ఆదాయం వస్తుందని చైర్మన్ అదిల్ ఖాన్ మంత్రికి వివరించారు.అనంతరం అజాద్ పూర్ మండి మార్కెట్‌లో పండ్లు కూరగాయలు, పసుపు మార్కెటింగ్ విధానాలను మంత్రి పరిశీలించారు. రైతులు , ట్రేడర్లు, అదికారులతో సమావేశం నిర్వహించి మార్కెట్ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యాన పంటల ప్రాధాన్యం, వాటి ఉత్పత్తుల విలువ ఎక్కువగా ఉంటుందన్నారు.

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగుకుడా పెరుతోందన్నారు. 140కోట్ల జనాభా ఉన్న మనదేశంలో పండ్ల రైతులకు ప్రోత్సాహం అవసరం అన్నారు. మారుతున్న జీవన శైలి నేపధ్యంలో పండ్లకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రజలు ఎక్కువగా పండ్లను వినియోగిస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయన్నారు. భవిష్యత్తులో మరింత మారతాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం సుస్థిరమవుతోందన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడాలో అతిపెద్ద పండ్ల మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన అని , అందుకు 178ఎకరాల విస్తీర్ణంలో పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. తెలగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్వర్యంలో కొహెడలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News