Monday, December 23, 2024

విత్తన సరఫరాలో రాష్ట్ర రైతులకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే సీజన్‌లో కంపెనీలు విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రైతులకు విత్తన సరఫరా , తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నత అధికారులతోపాటుగా విత్తన కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ, విత్తన ధ్రువీకరణ సంస్థ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ముఖ్యంగా, వచ్చే సీజన్ లో రైతులకు విత్తన సరఫరా , నాణ్యమైన విత్తన లభ్యత (ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న) పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా, రైతులకు విత్తన లభ్యతలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులను విత్తన కంపెనీలను ఆదేశించారు.విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు అధికా ప్రాధాన్యత ఇచ్చి, మిగతా విత్తనాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు సూచించారు. అదేవిధంగా, రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల వలన రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలు తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలీ సూచించారు. ఆదేవిధంగా, తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అన్ని రకాల విత్తనాలు అభివృద్ది చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News