Monday, January 20, 2025

ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత : మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యం, రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ను హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగాణంలో మంగళవారం పలువురు దివ్యంగులు కలిశారు. ప్రభుత్వం తమకు ఇస్తున్న పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ఆమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంలోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తమ నియోజకవర్గం ఎంఎల్‌ఎను, జిల్లా మంత్రిని సంప్రదించి తమకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయించు కోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News