కరీంనగర్: జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వ పరంగా పూర్తి సహాకారాన్ని అందిస్తానని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. బుధవారం కరీంనగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ మహిళా సహాకార అభివృద్ధి సంస్థ వారి మహిళా ఉద్యోగినుల వసతి గృహంలో ట్రాన్స్‌జెండర్ల చేసిన కుట్టుమిషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లందరు గౌరవప్రదంగా జీవించాలని, అందుకు కావాల్సిన పూర్తి సహాకారాన్ని అందిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. అదే విధంగా ట్రాన్స్‌జెండర్లందరు ఎంతో విలువైన ఓటు హక్కును కలిగి ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరు ఫామ్ 6 ఫారం ద్వారా వారి దరఖాస్తులను తహసిల్దార్‌కు అందజేశాలని తెలిపారు.
అదే విధంగా వారికి వెంటనే ఓటరు గుర్తింపు కార్డులను అందించడంలో అధికారులు తక్షణ చర్యలకు పూనుకోవాలని సూచించారు. ఓటరు గుర్తింపుకార్డులతోపాటు ఆధార్, ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డులను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ వసతి గృహ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీడబ్లుఓ సంధ్యారాణి, తహసిల్దార్ సుధాకర్, జిల్లా మేనేజర్ జి సునంద, సఖి కో ఆర్డినేటర్ లక్ష్మీ, ట్రాన్స్‌జెండర్లు, తదితరులు పాల్గొన్నారు.