Monday, December 23, 2024

శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
  • గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం సందర్భంగా యాచారం మండలం మేడిపల్లి-నక్కర్త గ్రామం రాచకొండ పోలీస్‌కమీషనర్ పరిధిలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్‌ను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహేశ్వరం డిసిపి శ్రీనివాస్‌రావుతో కలిసి ప్రారంభించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు యాచారం,కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలో సుమారు 19వేల ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఔషధినగరి ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటి కల్పించడానికి మేడిపల్లి-నక్కర్త గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం అద్దె భవనంలో తాత్కాలిక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి తెలిపారు. త్వరలోనే మేడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో టిఎస్‌ఐఐసి పోలీస్ శాఖకు కేటాయించిన సుమారు ఆరు ఎకరాల పరిధిలో అన్నిహంగులతో పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వివరించారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునదుద్ఘాటించారు.

నూతనంగా ఏర్పాటు చేసిన ఠాణా పరిధిలోకి యాచారం,కందుకూరు,కడ్తాల్‌కు చెందిన సుమారు 19 గ్రామ పంచాయతీలు వాటి అనుబంధ గ్రామాలు రానున్నాయి.యాచారం మండలంలోని మేడిపల్లి-నక్కర్త,నానక్‌నగర్,పిల్లిపల్లి, తాటిపర్తి, గొల్లగూడ, మంగలిగడ్డ, మర్లకుంటతండాలతో పాటు కందుకూరు మండలంలోని సాయిరెడ్డిగూడెం, ముచ్చర్ల, ఉట్లపల్లి, మీర్‌ఖాన్ పేట, ఆకులమైలారం, పంజాగూడ, మాలగూడెం, బేగరికంచ,సార్లరావుల పల్లి, సార్లరావులపల్లి తండా, బండమీదితండా, గుట్టలతండా, పోచమ్మగడ్డతండా, పోతుగడ్డతండా అలాగే కడ్తాల్ మండలంలోని పల్లెచల్కాతండా గ్రామాలు రానున్నాయి.ప్రస్తుతం ఎస్సై ప్రసాద్‌తో పాటు మరికొంతమంది పోలీస్ సిబ్బందితో స్టేషన్ కొనసాగనుందని అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో ఆర్డీవో ఈ.వెంకటాచారి,ఎసిపి ఉమామహేశ్వరరావు,ఎంపిపి కొప్పు సుకన్యబాష,జడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మయాదయ్య,పిఎసిఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి,సిఐ సుందరి లింగయ్య,ఎంపిడివో విజయలక్ష్మీ,డిటి ప్రవీణ్ కుమార్,సర్పంచ్‌లు సిహెస్ శ్రీనివాస్‌రెడ్డి,బండిమీది కృష్ణ,ఆర్.జగదీశ్,ఎంపిటిసిలు మొరుగు శివలీలరమేశ్,మార్కెట్‌కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్,పిఎసిఎస్ డైరెక్టర్లు పాశ్చబాష,ఎం.స్వరూప,ఎస్సైలు వెంకట్‌నారాయణ,గోపాల్,శంకరయ్య పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News