Sunday, December 22, 2024

భద్రతకే ప్రాధన్యత ఇవ్వాలి: సిపి సివి ఆనంద్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః రాన్నున్న పండలకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి రానున్న నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు విభాగాలను మంగళవారం పరిశీలించారు. సిటీ సెక్యూరిటీ వింగ్(సిఎస్‌డబ్లూ), సిఏఆర్, హార్స్, డాగ్స్ కెన్నల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని అన్నారు.

సిఎస్‌డబ్లూ సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవాలని అన్నారు. హెల్త్‌ను మరింత మెరుగు పర్చుకోవాలని కోరారు. విఐపిల సెక్యూరిటీ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. హోంగార్డుల హెడ్ క్వార్టర్స్‌ను పరిశీలించారు, శాంతిభద్రతల్లో హోంగార్డుల పాత్ర కీలకమని అన్నారు. రానున్న పండగల సమయంలో మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. మౌంటెడ్ పోలీస్ యూనిట్‌ను పరిశీంచారు.అక్కడ 46గుర్రాలు, 26 డాగ్స్‌కు హెల్త్ కండీషన్, పెడుతున్న ఫుడ్ గురించి ఆరాతీశారు. వాటికి రోజు మంచి డైట్ పెట్టాలని, ఎక్స్‌ర్‌సైజ్ చేయించాలని అన్నారు. సిటీ సెక్యూరిటీ వింగ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సిఎఆర్ జాయింట్ సిపి ఎం. శ్రీనివాసులు, సిఎస్‌డబ్లూ డిసిపి అలెక్స్, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News