Monday, December 23, 2024

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల
వైద్య పరీక్షలు పేద ప్రజలు పొందాలి

ఉచిత సిటి స్కాన్‌తో
ఒక్కొక్కరికి రూ.5 వేల ఆర్థిక భారం తగ్గుతుంది

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలోనే రేడియాలజీ
హబ్‌ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు

Priority to public health
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : రూపాయి ఖర్చు లేకుండా అన్ని రాకల వైద్య పరీక్షలు పేద ప్రజలు పొందాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు భావించారు. ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్యం పొందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య సేవలు అందించాలన్నదే తపన అన్నారు. ఇప్పటికిఏ కార్పొరేట్‌కు దీటుగా సిద్దిపేట సర్కారు దవాఖానాలో ఉచితంగా డయాగ్నోస్టిక్, సిటిస్కాన్ వైద్యసేవలు అందుతుండగా తాజాగా రేడియాలజీ హబ్ త్వరలో అందుబాటులోకి రానుంది.
రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేయించేలా : సిద్దిపేట జిల్లాలో 33 పీహెచ్‌సీలు, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, నంగునూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు వెల్‌నెస్ కేంద్రం, అర్బన్ హెల్త్ కేంద్ర ఆసుపత్రులు, గజ్వేల్‌లోజిలా ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నింటికి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతూ సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గుండె వలె మారింది. ఇదే ఆసుపత్రికి అనుసంధానంగా ఇప్పటికే డయాగ్నోస్టిక్ హబ్‌లో 59 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా నిత్యం సగటు 1000 వరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని 24 గంటల్లో ఫలితాలు పొందుతున్నారు. సదరు హబ్‌కు అనుసంధానంగా రేడియాలజీ విభాగం గతేడాది మంజూరైనప్పటికీ అవసరమైన పరికరాలు సమకూర్చుకొని ఇన్సలేషన్ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తరహా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో
రేడియాలజీ విభాగం సేవలు సిద్దిపేట నుంచే ప్రారంభానికి సిద్ధమైంది.
రేడియాలజీ హబ్‌లో ఐదు రకాల వైద్య పరీక్షలు ఉచితం
ప్రధానంగా గర్భిణులలో శిశువు ఆరోగ్య స్థితి పెరుగుదల తెలుసుకునేందుకు గుండె సంబంధిత రక్తనాళాల్లో అడ్డంకులు ఇతరత్రా సమస్యలు, హృదయ స్పందనలు, మహిళల్ల రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించేలా రేడియాలజీ విభాగం సేవలు ఉంటాయి. క్యాన్సర్ కణాలను నిర్ధారించే మెమోగ్రామ్ పరీక్షను ప్రైవేట్ ల్యాబ్‌లో చేయాలంటే రూ.3 వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తారు.
ఎక్స్‌రేకు రూ.500, ఆల్ట్రా సౌండ్‌కు
రూ. 600, ఈసీజీకి రూ. 300, 2డిఎకో పరీక్షకు
రూ. 1500 వరకు ప్రైవేట్ ల్యాబ్‌లలో తీసుకుంటున్న క్రమంలో సర్కార్ దవాఖానాకు వచ్చే రోగులపై ఆర్థిక భారం పడుతున్న విషయాన్ని గ్రహించిన మంత్రి
రేడియాలజీ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చారు.
* రూ.5 వేల ఆర్థిక భారం తగ్గింది
చిన్నపాటి జ్వరానికే పది రకాల పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక గుండె, కాన్సర్, ఇతర జబ్బులకు వేలు, లక్షలు దాటుతున్నాయి. గత రెండు దశల్లోను డాక్టర్లు కొవిడ్ సోకిన వారికి మెజార్టీ శాతం సీటి స్కానింగ్ తీయించారు. ఒక దశలో సర్కారు దవఖానా కూడా కొవిడ్ నిర్థారణకై సీటిస్కాన్‌నే నమ్ముకున్నారు. ఈ క్రమంలో దృష్టి సారించిన మంత్రి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత సీటిస్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయింయి ఒక్కోక్కరిపై రూ. 5 వేల ఆర్థిక భారాన్ని తగ్గించారు. మరో వైపు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎక్స్‌రే,ఈసీజీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్ధారించే ల్యాబ్‌లపై దృష్టి సారించి ఆరోగ్యమంత్రి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసపత్రుల్లోకి వెళ్లినరోగులకు ఉచితంగా పరీక్షలు జరిగేలా
రేడియాలజీ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News