Monday, December 23, 2024

పబ్బులో కస్టమర్‌పై బౌన్సర్ల దాడి

- Advertisement -
- Advertisement -

Prism pub bouncers attack on customer

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

హైదరాబాద్: పబ్బుకు వెళ్లిన యువకుడిపై దాడి చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దాడిలో గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం…నగరానికి చెందిన నందకిషోర్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి ప్రీజం పబ్బుకు వెళ్లాడు. పబ్బులో కొంత సేపు ఎంజాయ్ చేసిన తర్వాత సిగరేట్ తాగేందుకు పక్కకు వెళ్లాడు. సిగరేట్ తాగుతుండగా బౌన్సర్లు వెనుక నుంచి వచ్చి దాడి చేయడం ప్రారంభించారు. నో స్మోకింగ్ జోన్ తెలియదని నందకిషోర్ చెప్పినా కూడా వినకుండా దాడి చేశారు. బౌన్సర్లు దాడి చేస్తుండగా ఆపాల్సిన యాజమాన్యం, వారితో కలిసి నందకిషోర్‌పై దాడి చేశారు. తన స్నేహితులు విడిచిపెట్టాలని బౌన్సర్ల కాళ్లు పట్టుకున్నా విడిచి పెట్టలేదని బాధితుడు చెప్పారు. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News