Monday, December 23, 2024

జైలులో పాడాడు.. సినిమా ఛాన్స్ కొట్టేశాడు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో మద్యం తాగినందుకు జైలు పాలైన ఒక వ్యక్తికి అదృష్టం జైలు గోడలను బద్దలు కొట్టుకుంటూ మరీ వరించింది. జైలులో ఆ ఖైదీ పాడుతున్న ఒక భోజ్‌పురి పాట వీడియో బయటకు వెళ్లడంతో బాలీవుడ్‌లో పాట పాడే అవకాశం అతడిని వెదుక్కుంటూ వచ్చింది,. మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో మద్యం తాగినందుకు బుక్సర్‌లో పోలీసులు కన్హయ్య కుమార్‌ను అరెస్టు చేశారు. బయటరాష్ట్రంలో మద్యం తాగినప్పటికీ బీహార్‌లోకి మాత్రం మద్యం సేవించి ప్రవేశించడానికి వీల్లేదు.

అయితే ఉత్తర్ ప్రదేశ్‌లో పనిచేసేందుకు వెళ్లిన కన్హయ్య కుమార్ అక్కడ మద్యం సేవించి బీహార్‌లోకి రావడంతో అరెస్టయి జైలు పాలయ్యాడు. బుక్సర్ జైలులోని నాలుగు గోడల మధ్యలో అతను భోజపురి పాట పాడుతున్న సమయంలో సెల్ బయట ఉన్న జైలు సిబ్బంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతోపాటు బాలీవుడ్ సంగీత పరిశ్రమ దృష్టిలో పడింది. కన్హయ్య పాటకు ముగ్ధుడైన బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారి తన సొంత మూజిక్ కంపెనీలో కన్హయ్య అవకాశం ఇవ్వనున్నట్లు ట్వీట్ చేశారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఖైదీ కన్హయ్యకు న్యాయ సహాయం చేయడానికి ముందుకు రావడంతోపాటు యుపిలోని ప్రముఖ స్టూడియోలో పాట పాడేందుకు అవకాశం క్పలిస్తానని హామీ ఇచ్చారు. కన్హయ్య గాన మాధుర్యాన్ని మీరు కూడా ఆస్వాదించండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News