న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఇద్దరు ఇతర ఖైదీలు తమ వార్డ్‌లో క్షౌరం చేయించెకుంటున్నప్పుడు హఠాత్తుగా వారు మంగలి కత్తితో మరో ఖైదీపై దాడి చేశారని జైలు అధికారులు ఆదివారం తెలిపారు. తీహార్ సెంట్రల్ జైలులోని నం. 8లో డిసెంబర్ 10న ఈ ఘటన చోటుచేసుకుంది. “ఘర్షణలో బాధితుడు, దాడిచేసిన ఓ ఖైదీకి గాయాలయ్యాయి. ఆ తర్వాత వెంటనే వారిని జైలు సిబ్బంది వేరుచేశారు. గాయపడిన ఆ ఇద్దరు ఖైదీలు అంత సీరియస్‌గా ఏమీలేరు” అని సీనియర్ జైలు అధికారి తెలిపారు. వారిని చికిత్స కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు తరలించారు. వారిని అదే రోజున చికిత్స చేసి డిశ్చార్చి చేశారు. ప్రస్తుతం వారిప్పుడు జైలులోనే ఉన్నారు.
“బాధితుడు యోగేశ్ ఇతర ఖైదీలు దాడిచేయగా ఆసుపత్రిలో చేరాడు” అని హరినగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. గాయపడిన వ్యక్తి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వదలచుకోలేదు. కానీ జైలు అధికారుల నుంచి ఆ ఘటనకు చెందిన సమాచారం అందింది” అని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. “ఐపిసి సంబంధిత సెక్షన్ల కింద కేసు రిజిష్టరు అయింది. దర్యాప్తు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు” అని ఆ అధికారి వివరించారు.