Saturday, September 21, 2024

జైలు… భార్య రాలేదని మర్మాంగాన్ని కట్ చేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

 

మాడ్రిడ్: క్రిస్మస్ పండుగ సందర్భంగా జైల్లో ఉన్న భర్తను భార్య చూడటానికి రాలేదని అతడు మర్మాంగాన్ని కట్ చేసుకున్న సంఘటన స్పానిష్ లోని ప్యూరెటో ది శాంతా మారియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… క్రిస్మస్ సందర్భంగా స్పానిష్ తన దగ్గర బంధువులను ఖైదీలను చూడాటానికి అనుమంతించడంతో ఒక రోజు వారితో గడపడానికి అనుమతిస్తారు. జైళ్లో తన భర్తను భార్య చూడటానికి ఇష్టపడకపోవడంతో ఆమె అతడిని కలువడానికి రాలేదు. దీంతో సదరు ఖైదీ తన మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు. వెంటనే జైలు సిబ్బంది ఖైదీని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి సదరు ఖైదీ బయటపడ్డాడు కానీ అతడి అంగాన్ని తిరిగి పూర్వస్థితికి తేలమని వైద్యులు వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి అతడి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని బంధువులు పేర్కొన్నారు. గత సంవత్సరం స్పెయిన్ లో ఓ ఖైదీ తన చెవి కింది భాగాన్ని కోసుకొని మింగిన సంఘటన తెలిసిందే. 2020 మే నెలలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ వ్యక్తి తన శివుడి కోసం తన మర్మాంగాన్ని కట్ చేసుకున్నానని చెప్పిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండ ఉండటానికి గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి దేవుడు గుడిలో నాలుక కోసుకొని దేవుడికి ఆర్పించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News