Monday, December 23, 2024

మెదక్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మెదక్ జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ గుండె పోటుతో చనిపోయాడు. మెదక్ పట్టణానికి చెందిన బేతి రాములు అనే వ్యక్తి 307 సెక్షన్ కింద ఈ నెల 2వ తేదీన సబ్ జైల్ కు తరలించారు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం 5:00 గం.లకు ఫిట్స్ రావడంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా గుండె పోటుతో మృతి చెందాడు.

భార్య సంధ్య మాటల్లో తన స్నేహితులతో తరచు తాగడం అలవాటు ఉందన్నారు. నెల క్రితం పక్కన ఉన్న స్థల వివాదం వలన స్నేహితులు కొట్టి వారే పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చారని, తరువాత తన భర్తను రిమాండ్ కు తరలించారన్నారు.  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టమ్ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News