Monday, January 20, 2025

చంచల్ గూడ జైలులో ఖైదీ మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంచల్ గూడ జైలులో ఓ ఖైదీ మృతి చెందాడు. సెల్ పోన్ దొంగతనం కేసులో నిందితుడిగా అరెస్టై జైలులో ఉన్న రాజు అనే ఖైదీ ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో జైలు సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ సోమవారం ఖైదీ రాజు చనిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని జైలు అధికారులు ఖైదీ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఖైదీ మృతి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News