చర్లపల్లి : చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం(ఒపెన్‌జైలు)నుంచి గురువారం ఉద యం మాలోత్ హుస్సేన్(55) జీవితఖైదీ నెంబర్ 4445 తప్పించుకుని పారిపోయాడు. చర్లపల్లి ఒ పెన్ జైలు అధికారులు, కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కోణిజర్ల మండలం మేకలతండాకు చెందిన మాలోత్ హు స్సెన్ గత 18 నెలలుగా చర్లపల్లి ఒపెన్ జైల్లో జీవితఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. 2015 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో జరిగిన హత్యకేసులో జిల్లా కోర్టు మాలోత్ హుస్సెన్‌కు జీవితఖైదీ విదించింది.
అప్పటి నుంచి వరంగల్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించిన హుస్సెన్ వరంగల్ జైలు కూల్చడంతో చర్లపల్లి ఒపెన్ జైలుకు తరలించారు. గత 18నెలల నుంచి ఒపెన్ జైలులో వంటమనిషిగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఖైదీల కోసం వంట చేసేందుకు కిచెన్‌కు వ చ్చి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్టు జైలు అధికారులు తెలిపా రు. ఈమేరకు స్ధానిక కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసుకుని ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.