Thursday, January 23, 2025

భార్యను తల్లిని చేసేందుకు ఖైదీకి 15 రోజుల పెరోల్!

- Advertisement -
- Advertisement -

Prisoner gets 15-day parole to make wife pregnant

జోధ్‌పూర్ హైకోర్టు బెంచ్ సంచలన తీర్పు

జోధ్‌పూర్: భార్యను తల్లిని చేసేందుకు ఓ ఖైదీకి జోధ్‌పూర్ హైకోర్టు 15 రోజులు పెరోల్ మంజూరుచేసింది. గర్భం దాల్చడం, సంతానం పొందడం మహిళ హక్కు అని దాన్ని తాము కాదనలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజస్థాన్‌కు చెందిన 36 ఏళ్ల నందలాల్‌కు ఒక కేసులో భిల్వారా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో అతను అజ్మీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా సంతానం కలిగేందుకు తన భర్తను విడుదల చేయాలంటూ నందలాల్ భార్య రేఖ జోధ్‌పూర్ హైకోర్టు బెంచ్‌ని ఆశ్రయించింది. న్యాయమూర్తులు ఫర్జాద్ అలీ, సందీప్ మహతాలతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది. ఖైదీ జైలు శిక్ష కారణంగా అతని భార్య సంతానం పొందే హక్కును కోల్పోయిందని బెంచ్ అభిప్రాయపడింది. ఎలాంటి నేరం చేయని ఆమె భావోదేగమైన, లైంగికపరమైన ఆ హక్కును కోల్పోవడం భావ్యం కాదని ధర్మాసనం పేర్కొనింది.

అలాగే మహిళ సంతాన హక్కుకు సంబంధించి రుగ్వేదంతో పాటు పలు హిందూ గ్రంథాలను హైకోర్టు ప్రస్తావించింది. జుడాయిజం, క్రైస్తవ, ఇస్లాం సిద్ధాంతాలను కూడా కోర్టు ప్రస్తావించింది. 16 మత కర్మలలో బిడ్డను కనడం స్త్రీకి మొదటి హక్కని హైకోర్టు ధర్మాసనం నొక్కి చెప్పింది. ఈ ధర్మాన్ని నెరవేర్చడం కోసం రేఖ భర్త, జీవిత ఖైదీ అయిన నందలాల్‌కు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. 2020లో 20 రోజుల పెరోల్‌పై విడుదల అయిన అతను మంచి ప్రవర్తనతో జైలుకు సరెండర్ అయిన వైనాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకొంది. దోషుల ఇతర ప్రాథమిక హక్కులను తిరస్కరించకూడదంటూ డి భువనకుమార్ పట్నాయక్,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉదహరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News