Monday, January 20, 2025

చంచల్‌గూడ జైల్లో ఖైదీ అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చంచల్‌గూడ జైల్లో విషాదం జరిగింది. ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెల్‌ఫోన్ చోరీ కేసులో కిస్మత్ పూర్‌కు చెందిన రాజును నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారంరాత్రి అస్వస్థతకు గురైన రాజును పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం రాజు చనిపోయాడు. దీంతో జైలు అధికాకారులు రాజు చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాజు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రాజు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News