Thursday, January 23, 2025

15 రోజుల్లో ఖైదీలు లొంగిపోవాలి: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న కాలంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు బెయిల్‌పై విడుదల చేసిన ఖైదీలు, విచారణ ఖైదీలు అందరూ 15 రోజుల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు గుఉవారం శుక్రవారం అదేశించింది. కొవిడ్ కాలంలో విఎమర్జెన్సీ బెయిల్‌పై విడుదలైన విచారణ ఖైదీలు సంబంధిత కోర్టులలో లొగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

కొవిడ్ కాలంలో విడుదలైన ఖైదీలు తమ శిక్షాకాలాన్ని రద్దు చేయాలని కోరుతూ సంబంధిత కోర్టులలో లొంగిపోయిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని కూడా ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులపై జైళ్లలో సాధారణ నేరాలపై ఉన్న అనేక మంది ఖైదీలు, విచారణ ఖైదీలను కొవిడ్ కాలంలో ఎమర్జెన్సీ బెయిల్‌పై విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు వీరంతా 15 రోజుల్లో సంబంధిత కోర్టులలో లొంగిపోవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News