- Advertisement -
న్యూఢిల్లీ: కొవిడ్-19 సెకండ్ వేవ్ కాలంలో తమ ఆదేశాల మేరకు రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి కమిటీలు(హెచ్‌పిసి) విడుదల చేసిన ఖైదీలను తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు లొంగిపోవాలని ఆదేశించకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ఖైదీల విడుదలపై మే 7న తాము ఇచ్చిన ఆదేశాల అమలుకు అవలంబించిన నియమ నిబంధనలను వివరిస్తూ ఐదు రోజుల్లోపల నివేదిక అందచేయాలని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం హెచ్‌పిసిలను ఆదేశించింది. రాష్ట్రాల హెచ్‌పిసిల నుంచి వివరాలు అందిన తర్వాత ఒక నివేదికను దాఖలు చేయవలసిందిగా జాతీయ న్యాయ సేవా సంస్థ(నల్సా)ను కూడా ధర్మాసనం ఆదేశించింది.
- Advertisement -