Thursday, January 23, 2025

టీవీలు, ఫోన్ల కోసం జైలు ఖైదీల సమ్మె

- Advertisement -
- Advertisement -

భటిండా : పంజాబ్‌లోని భటిండా సెంట్రల్ జైలులో ఖైదీలు ఆదివారం సమ్మెకు దిగారు. జైలులో టీవీలు ఏర్పాటు చేయాలని, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఎక్కువగా ఫోన్ సౌకర్యం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ఈ జైల్లో దాదాపు 52 మంది వరకూ గ్యాంగ్‌స్టర్స్, తీవ్రస్థాయి శిక్షలు పడ్డ వారు ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలు ఆహారం తీసుకోకుండా సమ్మెకు దిగడంతో జైలు అధికారులు కంగుతిన్నారు.

జైలు నిబంధనల మేరకు తమకు టీవీలు ఉంటే వినోదాత్మక సినిమాలు , కార్యక్రమాలు తిలకించేందుకు వీలుంటుందని ఖైదీలు తెలిపారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ ఎన్‌డి నెగీ స్పందించారు. బరాక్‌లలో ఇటువంటి సౌకర్యాలు కల్పించే విషయంపై ఇప్పుడు హైకోర్టు పరిశీలనలో ఉందని , కోర్టు నిర్ణయం వరకూ వేచిచూడాల్సిందే అన్నారు. అన్ని బరాక్‌లలో టీవీలు ఏర్పాటు చేయడం భద్రతా కారణాలతో సాధ్యం అయ్యే పనికాదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News