Saturday, March 22, 2025

లీక్ వీడియోలపై అంత ఆసక్తి ఎందుకో: పృథ్వీరాజ్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి29. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబధించిన ఓ వీడియో కొద్దిరోజుల క్రితం లీక్ అయింది. ఈ వీడియోని అభిమానులు తెర వైరల్ చేశారు.

పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన సినిమా ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఎస్ఎస్ఎంబి29 సినిమా లీక్ వీడియోపై కామెంట్ చేశారు. ‘అసలు లీక్ వీడియోలు చూడటానికి ప్రేక్షకులు ఎందుకు అంత ఆసక్తి కనబరుస్తారో నాకు అర్థం కాదు. అందులో గొప్పేంముంది. అవి చూడటం వల్ల సినిమాపై ఆసక్తి కోల్పోతారు. బిగ్‌స్క్రీన్‌పై సన్నివేశాన్ని ఆస్వాదించలేరు’ అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న సినిమా గురించి ఇప్పుడు ఏం మాట్లాడనని.. చిత్ర యూనిట్ నుంచి అప్‌డేట్ వస్తేనే మంచిదని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం ఏడాది నుంచి వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News