Monday, December 23, 2024

‘సలార్’ విలన్ గా మలయాళం స్టార్..

- Advertisement -
- Advertisement -

Prithviraj Sukumaran first look out from Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నుంచి నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్‌స్ట్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘సలార్’ సినిమాలో ఆయన చేస్తున్న ‘వరదరాజ్ మన్నార్’ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. వరదరాజ్ మన్నార్ పాత్ర ప్రభాస్ పాత్రకు ధీటుగా ఉంటుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొప్ప డ్రామాను ప్రేక్షకులు ‘సలార్’ సినిమాలో చూడబోతున్నాం. అదే ఈ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండనుంది. పృథ్వీరాజ్ సుకుమార్ చేస్తున్న పాత్ర గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ… ‘మలయాళంలో సూపర్‌స్టార్ అయిన పృథ్వీరాజ్ మా ‘సలార్’ సినిమాలో చేయటం ఎంతో ఆనందంగా ఉంది. వరదరాజ మన్నార్ పాత్రలో ఆయన కంటే గొప్పగా మరెవరూ నటించలేరు. ఆయన ఈ పాత్రను పోషించిన తీరు అద్భుతం. తన గొప్ప నటనతో పాత్రకు న్యాయం చేశారు. ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల డ్రామా ఓ రేంజ్‌లో ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉంటుంది. ‘సలార్’లో ప్రభాస్ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్. ఐదు భాషల్లో సినిమా రూపొందుతోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు.

Prithviraj Sukumaran first look out from Salaar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News