Thursday, January 23, 2025

కిరోసిన్ ఆక్సిజన్ పవర్‌తో ప్రైవేట్ “అగ్నిబాణ్ ” రాకెట్

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో ప్రైవేట్ పరంగా అంతరిక్ష వాణిజ్యం, పరిశోధనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే . ఇప్పుడు “అగ్నికుల్ కాస్మోస్ ” అనే ప్రైవేట్ సంస్థ మార్చిలో తన రాకెట్ “అగ్నిబాణ్‌” ను ప్రయోగించడానికి సిద్ధమౌతోంది. అయితే దీని విశేషమేమంటే కిరోసిన్, లిక్విడ్ ఆక్సిజన్ కాంబినేషన్‌తో మొట్టమొదటి సారి ప్రయోగం కానుండడం. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బయలు దేరుతుంది. ఇది ఉప కక్ష రాకెట్ ( suborbital flight). అంటే ఇది అంతరిక్షం లోకి దూసుకుపోదు.

100 కిలోల బరువు మోసుకుంటూ భూమి ఉపరితలానికి 700 కి.మీ ఎత్తులో కక్షలోకి వెళ్తుంది. ప్రయోగ సమయంలో 14 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ 18 మీటర్ల ఎత్తులో పొడవుగా ఉంటుందని, 1.3 మీటర్ల చుట్టుకొలత గలిగి ఉంటుందని అగ్నికుల్ సిఇఒ శ్రీనాధ్ రవిచంద్రన్ వివరించారు.ఇది అతి సులువుగా షిప్ కంటైనర్ లేదా ట్రాయిలర్ లో ఇమిడి పోతుందని, సాంకేతికంగా వివిధ వ్యవస్థలలో తన సత్తా నిరూపించుకోవడమే ఈ ప్రయోగ లక్షంగా పేర్కొన్నారు.

రాకెట్ లో రెండు వేదికలు ఉంటాయి. మొదటి వేదిక ఇంజిన్ల సముదాయం. దీన్ని అగ్నైట్ అని పిలుస్తున్నారు. రెండో వేదిక అగ్నిలెట్ అనే ఇంజిన్‌తో ఉంటుంది. ఈ రెండు ఇంజిన్లు సెమీ క్రియోజెనిక్ ఇంజిన్లు. అంటే ఇవి రిఫైన్డ్ కిరోసిన్ , అతి చల్లబడిన లిక్విడ్ ఆక్సిజన్ సమ్మేళనం ఇంధనంగా వినియోగిస్తాయి. అగ్నికుల్ ఉపయోగించే ఈ రెండు ఇంజిన్లు భారత్‌లోనే స్వదేశీయంగా తయారయ్యాయి. ఇవి ఏకాండీ , 3డి ప్రింటెడ్ ఇంజిన్లు. ఈ విధంగా తయారు చేయడం ప్రపంచం లోనే మొదటిసారి అని సిఇఒ శ్రీనాధ్ చెప్పారు. 2022 నవంబరులో అగ్నికుల్ భారత్ లో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను శ్రీహరికోట నుంచే ప్రయోగించింది. అప్పుడు ఒక ట్రక్కు వెనుక భాగం పీఠం నుంచే ప్రయోగించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News