Sunday, January 19, 2025

వాగులో ప్రైవేట్ అంబులెన్స్ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా వద్ద మృతదేహంతో వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వాగులో బోల్తా పడింది. అంబులెన్సులో మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. అంబులెన్స్ జైనథ్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

అదృష్టవశాత్తూ, ప్రమాదం సమయంలో అంబులెన్స్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు పెద్దగా గాయాలు లేకుండా బయటపడ్డారు. ప్రమాద స్థలికి చేరుకున్న స్థానికులు వెంటనే సహాయం కోసం పిలుపునిచ్చారు. ప్రవాహంలో మునిగిపోయిన అంబులెన్స్‌లో మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు మృతదేహాన్ని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News