Monday, December 23, 2024

అగ్నిప్రమాదం.. తిరుపతి-రేణిగుంట హైవేపై కాలిబూడిదైన బస్సు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిబుడిదైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి-రేణిగుంట జాతీయ రహదారిపై శనివారం అర్థ రాత్రి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

అయితే, ప్రయాణికులందరినీ సకాలంలో బయటకు తీసుకురావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే.. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News