Sunday, January 19, 2025

ప్రైవేట్ బస్సు- లారీ ఢీ: 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Private bus lorry collision: 20 injured

హైదరాబాద్: బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. కొడికొండ చెక్ పోస్ట్- బాగేపల్లి మధ్యలో ప్రైవేట్ బస్సు- లారీ ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు ఆదోని నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్నట్టు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News