Saturday, December 21, 2024

బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి, 40మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదం కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా అతి వేగంతో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుప్పుతప్పి.. బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 40మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారులను హైదరాబాద్ చెందిన లక్ష్మీ(13), గోవర్ధిని(8)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News