Monday, January 20, 2025

నల్లగొండలో ప్రైవేటు బస్సు-డిసిఎం ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

వేములపల్లి: నల్లగొండ జిల్లా వేములపల్లిలోని శెట్టిపాలెం వద్ద ఆదివారం ఉదంయ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు- డిసిఎం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదు మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడడంతో  మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బాపట్ల నుంచి హైదరాబాద్ కు వస్తుండగా  ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News