Sunday, January 19, 2025

జో బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన ప్రైవేటు కారు…

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడి వాహనాన్ని ప్రైవేటు కారు ఢీకొట్టడం కలకలం సృష్టించింది. భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భార్య, ప్రథమ పౌరురాలు జిల్‌తో కలిసి డెలావర్‌లోని తన పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. పార్టీ కార్యాలయంలో డిన్నర్ ముగించుకొని జిల్ కాన్వాయ్‌లోకి వెళ్లగా 130 అడుగుల దూరంలో బైడెన్ ఉన్నాడు. అదే సమయంలో ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీకొట్టింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జో బైడెన్, జిల్ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News