Monday, December 23, 2024

ప్రైవేట్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఉరేసుకొని….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ప్రైవేట్ కాలేజీ విద్యార్థిని హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని చందకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అర్చన దాస్ అనే విద్యార్థిని బిఎస్‌సిలోని డెటా సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఎగ్జామ్స్ రాసి వచ్చిన తరువాత తన రూమ్‌లో చీరతో ఉరేసుకుంది. తోటి విద్యార్థులు గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సదరు విద్యార్థి చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తన అక్క ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని మృతురాలి సోదరి రేబటి బధేయ్ ఆరోపణలు చేశారు. తన అక్క హత్య వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపణలు చేసింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రయాణికుడి వీరంగం..బయల్దేరిన చోటికే తిరిగొచ్చిన విమానం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News