- Advertisement -
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ప్రైవేట్ కళాశాల విద్యార్థిని అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. వర్షిణి అనే విద్యార్థిని కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. మిడ్ ఎగ్జామ్ కోసం ఆమెను సమీప బంధువు మోహన్ రెడ్డి కళాశాలకు తీసుకెల్లారు. అనంతరం ఐడీ కార్డు, మొబైల్ ఇంట్లో మరిచిపోయానని చెప్పి ఆమె క్యాంపస్ నుంచి తిరిగి బయటికి వచ్చింది. సాయంత్రమైనా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -