Wednesday, December 4, 2024

ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

- Advertisement -
- Advertisement -

ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం అని పేర్కొన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలని సూచించారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. విద్యార్ధులు అధైర్యపడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని మంత్రి కోరారు. చావు సమస్యకు అంతిమ పరిష్కారం కాదు అని,బతికి సాధించాలని విద్యార్ధులకు మంత్రి పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్ధులకు ఏదైనా అత్యవసర సమస్య ఉంటే తన కార్యాలయం మొబైల్ నెంబర్ : 86880 07954 లేదా minister.randbc@gmail.com ఈమెయిల్‌కు తెలియజేయాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News