Tuesday, December 24, 2024

ప్రైవేట్ విద్యా సంస్థలను కొందరు వ్యాపార సంస్థలుగా మార్చుతున్నారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas goud fires on Bandi Sanjay

హైదరాబాద్: ఒక ఉపాధ్యాయుని కుమారుడిగా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రవీంద్రభారతిలో విద్యాశాఖ అధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో ఇండియా మొదటి స్థానంలోకి రాబోతుందన్నారు. బిజెపినే ప్రతి రాష్ట్రంలో ఉండాలనే దోరణితో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ నిధులు కూడా విడుదల కావడం లేదంటే మన రాష్ట్రంపై కేంద్రానికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని చురకలంటించారు. రాష్ట్రం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఉందని, అవన్నీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలను కొందరు వ్యాపార సంస్థలుగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. పలానా సంస్థలో చదివితేనే మంచి మార్కులోస్తాయనే లాగా కొందరు వ్యవహరిస్తున్నారని, పిల్లల ఎదుగుదలలో టీచర్ల బాధ్యత ఎంత ఉందో, తల్లిదండ్రుల పాత్ర అంతే ఉందన్నారు. విద్యాసంస్థల్లో పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని,  వ్యాపారం కోసమే నడుపుతున్న విద్యాసంస్థలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి మొదట సంక్షేమంపై సిఎం కెసిఆర్ దృష్టి పెట్టారని, ఇప్పుడు విద్యారంగంపై ఫోకస్ చేస్తున్నారని, వైస్ ఛాన్సలర్స్ అందరూ మచ్చ లేకుండా పని చేయాలని సూచించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అనేక జాడ్యాలున్నాయని, వాటిని దూరం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News