Tuesday, November 5, 2024

45కు పైబడిన వారికే ప్రైవేటలో టీకా

- Advertisement -
- Advertisement -

45 ఏళ్ల పై బడిన వారికే వ్యాక్సిన్ ఇవ్వాలి
ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా డోసులు కొనుగోలు చేయాలి
స్లాట్ బుక్ చేసుకున్నోళ్లకు మాత్రమే కేంద్రాలకు అనుమతించాలి
ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్యశాఖ అదేశాలు
కొత్తగా మరో 41,040 మందికి వ్యాక్సిన్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించింది. డోసుల సంఖ్య తక్కువున్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు డోసులు ఇవ్వొద్దని ఆదేశించింది. అది కూడా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపింది. నేరుగా కేంద్రాలకు వస్తే సదరు వ్యక్తులకు డోసులను తిరస్కరించాలన్నది. అయితే ఇప్పటి వరకు ప్రైవేట్ ఆసుప్రతులకూ ప్రభుత్వ నుంచి డోసులు సప్లాయ్ చేస్తుండగా ఇక నుంచి నేరుగా ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోళ్లు చేసుకోవాలని డిహెచ్ ప్రైవేట్ ఆసుపత్రులకు తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ కార్యకలాపాలను అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఓలు నిత్యం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. అయితే గత మూడు రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్‌ను నేటి నుంచి పుఃనప్రారంభించుకోవచ్చని హెల్త్ డైరెక్టర్ డాజి శ్రీనివాసరావు మంగళవారం సర్కూలర్ జారీ చేశారు.
ప్రభుత్వంలోనూ 45 ప్లస్ వారికే….
రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలోనూ 45 ప్లస్ వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.అది కూడా 100 శాతం స్లాట్ బుక్ చేసుకున్నోళ్లకే ఇస్తామన్నారు.అర్హులైన వారు @www>cowin>gov>inలో నమోదు చేసుకోవాలన్నారు. అయితే మొదటి ప్రయారిటీ సెకండ్ డోసు వారికి ఉంటుందని వివరించారు.
కొత్తగా మరో 41,040 మందికి టీకా…
రాష్ట్రంలో కొత్తగా మరో 41,040 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో 27,801 మంది మొదటి డోసు 13,239 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులెటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు 2,44,835 హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 1,81,497 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 2,46,778 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా 81,610 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 45 ఏళ్లు పై బడిన వారిలో 36,85,786 మంది మొదటి, 3,74,278 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,14,784 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే బుధవారం 2 గంటల వరకు 29,079 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు డోసులను రెడీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Private hospitals begins vaccine to above 45 Years in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News