Monday, December 23, 2024

శ్రీవారి దర్శనం కోసం వచ్చి భార్య, బావమరిదిని చంపిన భర్త…

- Advertisement -
- Advertisement -

తిరుపతి: మహారాష్ట్రకు చెందిన భక్తుడు తన భార్య, బావమరిదిని చంపి అనంతరం అతడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సంఘటన తిరుపతిలోని అలిపిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన యువరాజు తన భార్య మనీషా, బావమరిది హర్షవర్ధన్‌తో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చారు. కపిలతీర్థం సర్కిల్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున యువరాజు తన భార్య, బావమరిదిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఆ హోటల్‌కు చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: వరంగల్, హనుమకొండలో కెటిఆర్ పర్యటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News