Friday, January 10, 2025

గట్టుసింగారంలో ప్రభుత్వ భూమిని అమ్ముకుంటున్న ప్రైవేట్ వ్యక్తులు

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ విపి.గౌతమ్‌కు ఫిర్యాదు
  • పట్టించుకోని కూసుమంచి తహసీల్దార్ మీనన్

కూసుమంచి : మండలంలోని గట్టుసింగారం రెవెన్యూ పంచాయితీ పరిధిలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకుంటున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తూ కలెక్టర్ విపి గౌతమ్‌కు ఫిర్యాదు చేశారు. అయినా కూసుమంచి తహసీల్దార్ మీనన్ మాత్రం పట్టించుకోవడం లేదని ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలంలోని గట్టుసింగారం రెవెన్యూ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 12 లో ప్రభుత్వ భూమి సుమారు 56 ఎకారాలు ఉన్నది. ఇట్టి ప్రభుత్వ భూమిలో ఇండేన్ గ్యాస్ గోడం నిర్మాణం, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం కళాశాల నిర్మించగా దాని పక్కనే కొంత భూమిని ఇద్దరు వ్యక్తులు ఒకే సర్వే నంబర్ తో పట్టాలు పోంది ఒకరి పై ఒకరు కోర్టులో దాఖాలు వేసుకొని వివాదంలో ఉన్నారు. దాని ప్రక్కన డబులు బెడురూమ్ లు నిర్మించగా రైతు వేదిక తెలంగాణ క్రీడా ప్రాంగణం కేటాయించారు. ఇండ్లు లేని ప్రజలు దాని పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని తమకు కేటాయించాలని అధికారులను కోరుతున్నప్పటికి ఏమి పట్టించుకోవడం లేదు పేద ప్రజలు తమకు కేటాయించమని కోరే డబులు బెడురూమ్ ఆర్ అండ్ బి రోడ్డు మధ్యలో 20కుంటలు భూమి ఉన్న ఖాళీ స్థలాన్ని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఒక్కొక్క కుంట భూమిని లక్షలాది రూపాయలకు ఖమ్మం ప్రాంతానికి చెందిన వారికి గట్టుసింగారం లో ప్రయివేట్ వ్యక్తులు అమ్ముకుంటు రాళ్లు బాతి హద్దులు చేసుకోవడం కూడా జరిగింది. ఇట్టి విషయంపై ఇంటి స్థలం ఇండ్లు లేని గ్రామ ప్రజలు 2023 జనవరి 11న ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు గ్రీవెన్స్ డే లో తెలియ పరిచగా అదే సమస్యను పరిష్కరించమని కూసుమంచి తహసీల్దార్ మినను కు పిర్యాదు దారుల వినతీ పత్రాన్ని అందించగా ఐదు నెలలు గడుస్తున్నప్పటికి దానిపై రెవిన్యూ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ భూమిని అమ్ముకుంటున్న ప్రైవేట్ వ్యక్తుల నుండి కూసుమంచి రెవెన్యూ అధికారులకు ముడుపులు అందాయనే సందేహం పిర్యాదు దారుల నుండి వ్యక్తం అవుతుంది. ఇట్టి విషయం పై రెవిన్యూ అధికారులు స్పందించడం లేదని గట్టు సింగారం గ్రామ ప్రజల్లో తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వెనుక ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. గట్టుసింగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 12లో ప్రభుత్వ భూమిని ఇప్పటికైనా కాపాడాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తహసీల్దార్ మీనన్ వివరణ
గట్టుసింగారం గ్రామం నుంచి ఈ సమస్య ఒకసారి తన దృష్టికి వచ్చిందని దీనిపై పరిశీలన చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా సరే అక్రమించుకోవాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News