Thursday, December 26, 2024

ఆగని ప్రైవేట్ ల్యాబ్ ల దోపిడీ

- Advertisement -
- Advertisement -

నాలుగైదు రోజుల నుంచి అమాంతం పెంచిన ఫీజులు
పది రకాల పరీక్షలు చేసి రూ.16 వేలు బిల్లు వసూలు
రెండు రోజుల తరువాత ఫలితాలు వెల్లడిస్తున్న టెక్నిషియన్లు
నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అంటూ ఆసుపత్రిలో చేరాలని ఒత్తిడి
ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి విలవిలలాడుతున్న కరోనా రోగులు

Private labs fraud in corona test

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరో నా థర్డ్‌వేవ్ విశ్వరూపం దాల్చడంతో ప్రజలు వ్యాధి నిర్థారణ చేసుకునేందుకు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లితే కి ట్ల కొరత ఉందని వెనక్కి పంపిస్తుండటంతో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లితే అమాంతంగా ధరలు పెంచి రోగులను నిలువునా దోచుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి ఇష్టానుసారంగా టెస్టులు చేసి వ్యాధి నిర్థ్దారణ చేస్తున్నట్లు రో గులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కరోనా లక్షణాలు వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లి లక్షలో బిల్లులు, టెస్టులకు వెళ్లితే వేలలో ఫీజులు గుంజుడుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యశాఖ ల్యాబ్‌లు అడ్డగోలు ఫీజులు తీసుకోవద్దని టెస్టులు చేస్తే రూ. 2200, ఇంటి వద్దకు వెళ్లితే రూ. 2800 తీసుకోవాలని సూచించింది. కానీ ప్రైవేటు ల్యాబ్‌లకు వెళితే వైరస్‌ను గుర్తించేందుకు ఐదారు రకాలు టెస్టులు చేసి రూ. 25 వేలకుపై బిల్లు వేసి నయా దందాకు ఒడిగడుతున్నారు. కరోనా నిర్థ్దారణ కావాలంటే ర్యాపిడ్ యాంటిజెన్‌టెస్టులు, ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేస్తే పాజిటివ్, నెగిటివ్ అనే విషయంలో తెలుస్తుంది.

కానీ ప్రైవేటు ఆసుపత్రులు తమ జేబులు నింపుకునేందుకు తమ వద్ద అందుబాటులో ఉన్న టెస్టులను చేసి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లక్షణాలున్న వ్యక్తుల నుంచి రక్తనమూనాలు సేకరించి సిబిపి, సిఆర్‌బి, ఎల్‌బిహెచ్, బిడైయర్, ఇన్‌ఫిక్స్, ఫేర్‌పిట్ వంటి టెస్టుల చేస్తూ రూ. 12 వేలు నుంచి రూ.18వేలు, సిటీస్కాన్ రూ.16వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కార్పొరేట్ ఆసుపత్రుల్లో టెస్టుల ధరలు చెప్పతరం కాదు. 10 రకాల పరీక్షలు చేసి రూ. 25వేలకు పైగా బిల్లులు వేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టులతో గుర్తించే వ్యాధికి ఇన్ని రకాల పరీక్షలు ఎందుకుని రోగుల నిలదీస్తే వాటి ద్వారా సక్రమంగా -వ్యాధి నిర్థ్దారణ చేయలేమని సమాధానం చెప్పడంతో చికిత్సకంటే టెస్టులకే అధిక బిల్లులు వేయడంపై రోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం గ్రేటర్‌లో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్న, కేంద్రాలకు జనం తాకిడి పెరగడంతో దవాఖానాల్లో కిట్ల కొరత ఏర్పడిం ది. దీంతో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరి పరిస్థ్దితుల్లో ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తుంది. రోగుల రాకతో నిర్వాహకులు పలు రకాలు టెస్టులు చేయాలని చెబుతూ ముందుగానే సగం బిల్లు చెల్లించాలని పేర్కొంటూ, రెండు రోజుల తరువాత ఆసుపత్రికి వచ్చి రిపోర్టులు తీసుకెళ్లాలని చెబుతున్నారు. రిపోర్టు చేతిలో పెట్టినప్పడు అసలు బిల్లులు చూపిస్తూ పూర్తిగా టెస్టులకు నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల నెగిటివ్ వచ్చి పాజిటివ్‌గా వచ్చిందని చెబుతూ వారిని సమీపంలో ఉ న్న ఆసుపత్రిలో ఒత్తిడి చేసి చేర్చుతున్నారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని మాయామాటలు చెబుతూ వెంటనేఅడ్మిట్ అయ్యేలా మోసాలకు పాల్పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News