Friday, November 22, 2024

ప్రైవేట్ దోపిడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో అదనపు ఛార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు ప్రైవేటు బస్సుల్లో ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైల్వేస్టేషన్‌ల మధ్య ఈ ప్రత్యేకరైళ్లను నడిపిస్తోంది. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో ప్ర యాణికుల రద్దీ మొదలైంది. ఇదే అదునుగా ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణిస్తే సాధారణ ఛార్జీలపై అదనంగా 50 శాతం వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సాధారణ టికెట్ ఛార్జీలకు బదులుగా భారీగా అదనపు ఛార్జీలు వసూలు చేయడం గమనార్హం. రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయం ప్రకారమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నా ఆ చార్జీలు భారీగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

హైదరాబాద్ టు రాజమండ్రికి రూ.5 వేలు పండుగ సమయంలో ప్రైవే టు ట్రావెల్స్ దారులు అడ్డగోలుగా చార్జీల దోపిడీకి పాల్పడుతున్నారు. టికెట్ రేట్లను వారికి ఇష్టం వచ్చినంత పెంచి వసూలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రైవేట్ టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు సంక్రాంతి మరోవైపు శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఖర్చును సైతం లెక్క చేయకుండా సొంత ఊర్లకు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు రాబడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు టికెట్ ధరను వసూలు చేస్తున్నారు. 12, 13, 14 తేదీల్లో ట్రావెల్ బుకింగ్స్కు భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాలంటే ఒక్కరికీ రూ.5 వేలకు పైగా చెల్లించాల్సిందేనని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికే ఆర్టీసి 4 వేల పైచిలుకు బస్సులను పండుగ నేపథ్యంలో ప్రకటించినా అన్నింటిలోనూ రద్దీ ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News